Manase Chaalu / Track 05

పరుగు పరుగున ఎక్కడికో

Parugu Paruguna Ekkadiko

Pre-save Manase Chaalu ↗
More ···
Share on WhatsApp ↗
Oho oho ఆహా ఆ పరుగు పరుగున ఎక్కడికో ఈ పయనం తిరుగు లేని కాలంలో ఎటూ నీ గమనం సిరి సంపదల వేటలో నీ శాంతి ఏ తీరం నిను నువ్వే వెతుక్కునే విచిత్ర సమరం రంగుల లోకం మెరుగులలో నిను నువ్వే మరిచావా బంగారు పంజరం ఇష్టపడి ఆకాశం విడిచావా అంతస్తులు పెరిగే కొద్దీ ఆనందం తరిగిందా చింతల బరువును మోస్తూనే నీ గుండె అలిసిందా ఆ ఆ ఆ అంతస్తులు పెరిగే కొద్దీ వింతగా మనసు మారుతోం దా చింతలు పెరిగే కొద్దీ వింతగా గుండె భారం పెరుగుతోం దా మెత్తని పరుపును కొన్నావు నిదురను ఎందుకు విడిచావు ఖరీదైన గడియారం చూస్తూ కాలాన్నే ఎందుకు మరిచావు పరుగు పరుగున ఎక్కడికో ఈ పయనం తిరుగు లేని కాలంలో ఎటూ నీ గమనం సిరి సంపదల వేటలో నీ శాంతి ఏ తీరం నిను నువ్వే వెతుక్కునే విచిత్ర సమరం నిదురలో కమ్మని కలలు కనలేకున్నావు జోరు వానలో కేరింతలు వినలేకున్నావు నిదురలో కమ్మని కలలు కనలేకున్నావు జోరు వానలో కేరింతలు వినలేకున్నావు Mmm mmm తాన నాన నాన నా తేనెటీగవై సంపదల వేటలో తిరిగావు , తేనెను రేపటి ఆశలో దాచావు పంజరమే స్వర్గమని భ్రమలో ఉన్నావు , ఆనందం లేని బ్రతుకును మోస్తున్నావు సిరి సంపదలున్నా శాంతిని కోల్పోయావు , చుట్టూ జనులున్నా ఒంటరివై మిగిలావు కాలాన్ని నువ్వు వెలకట్టలేవు , తాళం వేసి కాలాన్ని బంధించలేవు పరుగు పరుగున ఎక్కడికో ఈ పయనం తిరుగు లేని కాలంలో ఎటూ నీ గమనం సిరి సంపదల వేటలో నీ శాంతి ఏ తీరం నిను నువ్వే వెతుక్కునే విచిత్ర సమరం ధనము కూడబెట్టి దానంబు చేయక తాను తినక లెస్స దాచుకొనగ తేనెటీగ కూర్చి తెరువరికియ్యదా విశ్వదాభిరామ వినుర వేమ విశ్వదాభిరామ వినుర వేమ

Lyrics: Veera Babu Manyam. Includes a verse attributed to Vemana. About Manase Chaalu