Manase Chaalu / Track 04

Available on Spotify

సంతోషం ఉంటేనే స్వర్గం నీదిరా బిడ్డా

Santhosham Untene Swargam Needira Bidda

Listen on Spotify ↗
More ···
Share on WhatsApp ↗
ఓఓఓ ఓరన్నా ఓఓఓ సంతోషం ఉంటేనే స్వర్గం నీదిరా బిడ్డా మంచితనం ఉంటేనే లోకం నీదిరా బిడ్డా కంచె ఏసి ఆశల్ని ఆపలేవురా బిడ్డా నేలతల్లి సాక్షిగా బతుకు నేర్చుకో బిడ్డా కోపమనేది నిప్పురా నీ ఇల్లునే కాల్చుద్దిరా దీపమల్లే వెలగరా నీ దారిని దిద్దుకోరా పాపమనేది ముప్పురా నీ బతుకును ముంచుద్దిరా రూపమనేది మాయరా నీ గుణమే నిలుచుద్దిరా కోపం వస్తే నీ బుద్ధి గడ్డి తింటాదిరా పాపం అంటే నీ మనసు కుళ్ళిపోతాదిరా రూపం కన్నా నీ గుణం గొప్పది కావాలిరా శాపం లాంటి ఆవేశం నిన్ను ముంచేస్తాదిరా అరెరెరెరె హోయ్ హోయ్ హోయ్ సంతోషం ఉంటేనే స్వర్గం నీదిరా బిడ్డా మంచితనం ఉంటేనే లోకం నీదిరా బిడ్డా కంచె ఏసి ఆశల్ని ఆపలేవురా బిడ్డా నేలతల్లి సాక్షిగా బతుకు నేర్చుకో బిడ్డా కమ్మని మాట ఉంటే కరువు రాదురా ఎప్పుడూ మంచి బాటలో నడిస్తే ముల్లు గుచ్చదు ఎన్నడూ నమ్మిన వాళ్లకి సాయం జేస్తే తోడుంటారు ఎప్పుడూ అమ్మలాంటి జాలి ఉంటే అండ దొరుకుతాది ఎల్లప్పుడూ లోపల శాంతి ఉంటే లోకమంతా పచ్చగ ఉంటాది లోపల కుళ్ళు ఉంటే గాలి కూడా విషమైపోతాది రూపము నీకు అద్దం నీ మనసే నీకు యుద్ధం చూపిస్తాది దీపము నీకు మార్గం నీ శాంతమే నీకు స్వర్గం ఇస్తాది ఆఆఆ ఏరీ ఏరీ ఏరీ అంతా మాయేరా సంతోషం ఉంటేనే స్వర్గం నీదిరా బిడ్డా మంచితనం ఉంటేనే లోకం నీదిరా బిడ్డా కంచె ఏసి ఆశల్ని ఆపలేవురా బిడ్డా నేలతల్లి సాక్షిగా బతుకు నేర్చుకో బిడ్డా మట్టిలోన గలిసే దేహం ఎందుకు అహంకారం గాలిలోన గలిసే ప్రాణం ఎవరిక్కడ శాశ్వతం కాలం ఏసే లెక్కల కర్మ నిన్ను వదలదురా సుడిగుండంలో సిక్కుకుంటే బతుకు నావ మునుగుద్దిరా ఆఆఆ ఏరీ ఏరీ ఏరీ అంతా మాయేరా కోపమనేది నిప్పురా నీ ఇల్లునే కాల్చుద్దిరా దీపమల్లే వెలగరా నీ దారిని దిద్దుకోరా పాపమనేది ముప్పురా నీ బతుకును ముంచుద్దిరా రూపమనేది మాయరా నీ గుణమే నిలుచుద్దిరా శాంతంగా ఉండు సక్కంగా బతుకు సక్కంగా బతుకు ఒరేయ్ సక్కంగా బతుకు నాయనా
Album
Manase Chaalu
Lyrics
Veera Babu Manyam
Released
Music & vocals
Created with AI assistance

Let the words become music.

Listen on Spotify ↗

Lyrics: Veera Babu Manyam. About Manase Chaalu