This teacher tribute opens with the traditional Sanskrit Guru Brahma shloka, written here in Telugu script, and continues with Telugu verses by Veera Babu Manyam.
Guru Brahma Guru Vishnu lyrics in Telugu
గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః!
గురు సాక్షాత్, పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః!
గురువు చూపిన జ్ఞాన కిరణం,
మరువలేము ఆ దివ్య చరణం!
కరుణ కురియును ప్రతి క్షణం,
వెలుగు వైపుకు ఈ పయనం!
పలక మీద అ-ఆ లు...,
తలరాతను మార్చే బాటలు!
గురువు మాకు ప్రాణము (ప్రాణము)!
మెరుగు దిద్దే రూపము (రూపము)!
కరుణ కురిసే మేఘము (మేఘము)!
దారి చూపే దీపము (దీపము)!
మాటలు చాలవు పొగడంగా...,
పాటలు చాలవు పాడంగా...!
కలలని పండించే కర్షకుడు,
ఇలపైన నడిపించే రక్షకుడు!
బలమును చేకూర్చే శిక్షకుడు,
గెలుపును అందించే దక్షకుడు!
పలక మీద అ-ఆ లు...,
తలరాతను మార్చే బాటలు!
గురువు మాకు ప్రాణము (ప్రాణము)!
మెరుగు దిద్దే రూపము (రూపము)!
కరుణ కురిసే మేఘము (మేఘము)!
దారి చూపే దీపము (దీపము)!
అక్షరాల ఆయుధాన్ని అందించిన వారు,
శిక్షణతో బ్రతుకులు మార్చిన వారు!
చీకటి ముసిరిన దారుల మధ్యన, కాంతులు చూపిన వారు!
మట్టి ముద్దను మూర్తిగ మలచిన శిల్పులు వారు!
(మాతృ దేవోభవ… పితృ దేవోభవ… గురు దేవోభవ…)
మాతృదేవత అమ్మే గదా,
పితృదేవుడు నాన్నే గదా!
ధాతృదేవుడు గురువే గదా,
చేయి పట్టి నడిపించును గదా!
మాటలు చాలవు పొగడంగా..., పాటలు చాలవు పాడంగా...!
గురువు మాకు ప్రాణము (ప్రాణము)!
మెరుగు దిద్దే రూపము (రూపము)!
కరుణ కురిసే మేఘము (మేఘము)!
దారి చూపే దీపము (దీపము)!
గురువే జ్ఞానపు దివ్య కిరణము,
గురువే జీవన సత్య చరణము!
తస్మై శ్రీ గురవే నమః...
తస్మై శ్రీ గురవే నమః...
(Fade Out with Flute)
About this song
A tribute to teachers that opens with the traditional Guru Brahma shloka. The Telugu verses describe the teacher as a guiding light, a source of compassion, and a sculptor who shapes lives through learning. The song expresses gratitude for the guidance that helps students grow.
English summary of the published Telugu lyrics.
Romanized reading guide
A transliteration of the Telugu text. Long vowels use marks such as ā and ī.
The verse honours the guru as Brahma, Vishnu and Maheshwara, and as the supreme reality. It ends with a salutation to the revered teacher. The Telugu verses that follow celebrate a teacher’s guidance, compassion and role in shaping a student’s life.
Is this the traditional shloka or a Telugu song?
This recording combines the traditional opening shloka with a longer Telugu tribute from the album Spoorthi Pradathalu. The complete song lyrics appear above.
Can I read it in English letters?
Open the Romanized reading guide above to follow the Telugu-script text in Latin letters. The English summary explains the theme; it is not a line-by-line translation.