Prema Geetham / Track 08

Released

దక్కవన్న దిగులు... నాకు అసలే లేదు

Dakkavanna Digulu Naaku Asale Ledu

View release page ↗
More ···
Share on WhatsApp ↗
ఓ... ఓ... హ్మ్మ్... ఆ... ఆ... హ్మ్మ్... (జతగా నువ్వే... రానక్కర్లేదు) (బతుకే నీతో... గడపక్కర్లేదు) దక్కవన్న దిగులు... నాకు అసలే లేదు దగ్గరవ్వకున్నా... నాకు బరువే కాదు నీడలాగ వెంటే... తిరగాలని లేదు తోడులాగ నిన్నే... అడగాలని లేదు రాత రాసినోడు... నిన్ను రాయలేదు గీత గీసినోడు... మనని కలపలేదు దూరమున్నా... ఈ దారము తెగిపోదే మౌనమున్నా... ఈ మమకారం చనిపోదే (నక్షత్రాలు రాల్చలేను... నీ కన్నీళ్లు తుడవగలను...) (గుడి కట్టి పూజించను... నీతోడు నీడలా ఉంటాను...) గోదారి గట్టుపైన గుండె జారిపోతుందే... ఏదారి వెతకమన్నా నిన్నే చేరమంటుందే! నీ నవ్వు చూస్తే చాలు... నా జన్మ ధన్యమౌతుందే... నా పేరు లేకపోయినా... నీ కథలో చోటు ఉంటుందే! తానన నాన... తానన నాన... ఓ... ఓ... కనుపాపల మాటున దాచిన కలలన్నీ నీవేనమ్మా... కనురెప్పల చాటున దాగిన కన్నీరు నీదేనమ్మా...! ముత్యమంత నవ్వుతో మురిపించే ముద్దుగుమ్మా...! అద్దంలాంటి మనసున కొలువున్న దేవతమ్మా...! నీ నీడ సోకినా చాలు... అది నాకు వరమేనమ్మా… నువ్వుంటే చాలు నాకు... ఇంకేమి వద్దులేమ్మా...! గోదారి గట్టుపైన గుండె జారిపోతుందే... ఏదారి వెతకమన్నా నిన్నే చేరమంటుందే! నీ నవ్వు చూస్తే చాలు... నా జన్మ ధన్యమౌతుందే... నా పేరు లేకపోయినా... నీ కథలో చోటు ఉంటుందే! తానన నాన... తానన నాన... ఓ... ఓ... ఓ... ఓ... హ్మ్మ్... లా లా లా... బదులేమీ ఇవ్వకపోయినా... పర్లేదులే ఓ గుమ్మా... ఎదురుచూపులోనే ఉంది... ఎంతో హాయి అమ్మా... చెప్పాలని ఉంది కానీ... పెదవి దాటలేదమ్మా... తప్పేమీ కాదేమోగా... ప్రేమంటే త్యాగమా... వెళ్ళిపోతా దూరంగా... నీకు అడ్డు రానమ్మా... చల్లగా నువ్వుండాలి... అంతే చాలమ్మా! గోదారి గట్టుపైన... గుండె జారిపోతుందే... నా పేరు లేకపోయినా... పర్లేదులే... (ఉండిపో... నవ్వుతూ నువ్వు ఉండిపో...)
Album
Prema Geetham
Lyrics
Veera Babu Manyam
Release status
Released
Music & vocals
Created with AI assistance

Let the words become music.

View release page ↗

Lyrics: Veera Babu Manyam. About Prema Geetham